15 ఏళ్ల ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన 40 ఏళ్ల బౌలర్..
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ 40 ఏళ్లు వచ్చినా బౌలింగ్‌లో మాత్రం జోరు తగ్గలేదు.
అండర్సన్ తాజాగా దక్షిణాఫ్రికాతో మాంచెస్టర్ టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అండర్సన్ మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు.
దీంతో 15 ఏళ్ల గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.
జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో 664, వన్డేల్లో 269, టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు(951) తీసిన బౌలర్‌గా అండర్సన్ నిలిచాడు.
అదే సమయంలో మెక్‌గ్రాత్ 2007లో 949 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.