బంతిని, బ్యాట్‌ను తాకకుండా ప్రపంచ రికార్డ్.. తొలి సారథిగా బెన్స్ స్టోక్స్..
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టెస్టు ఆరంభం నుంచి ఐర్లాండ్‌పై ఇంగ్లిష్ ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఓ అద్భుత రికార్డ్ సాధించాడు.
ఒక్క ఓవర్ కూడా వేయకుండా, బ్యాట్‌తో ఒక్క పరుగు కూడా చేయకుండా క్రికెట్ ప్రపంచంలో ఏకైక రికార్డులో నిలిచాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ కెప్టెన్ బ్యాటింగ్, బౌలింగ్ లేదా వికెట్ కీపింగ్ కూడా చేయకుండా మ్యాచ్ గెలిచాడు.
దీంతో ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు.
అలాగే ఈ మ్యాచ్ లో ఏమీ చేయని స్టోక్స్‌కు మరో బంపర్ ఆఫర్ దక్కింది.
రూ.16.41 లక్షల రూపంలో మ్యాచ్ ఫీజు అందనుంది.