పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే!

TV9 Telugu

29 January 2025

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ ఏడాది ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంగం.

తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు ఫిబ్రవరి 27న పోలింగ్‌, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.

అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 10వరకు గడువు ఉండగా.. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన జరగనుంది.

అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం కోసం ఫిబ్రవరి 13 వరకు గడువు ఇచ్చింది తెలంగాణ ఎన్నికల సంగం.

ఎన్నికలు జరిగే జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల సంగం.

తెలంగాణలోని మెదక్‌,నిజామాబాద్‌,ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఉపాధ్యాయ స్థానానికి MLC ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే మెదక్‌,నిజామాబాద్‌,ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పట్టభద్రుల స్థానానికి MLC ఎన్నికలు జరగనున్నాయి.

వీటితో పాటు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గానికి రాష్ట్రంలో MLC ఎన్నికలు జరగనున్నాయి.