శుభవార్త.. దిగివస్తున్న వంటనూనెల ధరలు

ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో  పాటు నిత్యవసర సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయి.

ఇక ఇటీవల కాలంలో వంట నూనె  ధరలు కూడా పెరిగిపోయాయి.  స్పందించిన కేంద్రం  నూనె ధరలు తగ్గించింది. 

ఇక తాజాగా మరోసారి రాబోయే రోజుల్లో  వంట నూనె ధరలు మరింతగా తగ్గే  అవకాశం ఉందని  సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాకర్స్‌  అసోసియేషన్‌ వెల్లడించింది.

తాజాగా నూనె గింజలు  కిలోకు రూ.3 నుంచి రూ.4 తగ్గే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కేంద్ర ప్రభుత్వం నూనెలపై దిగుమతి సుంకాలు తగ్గించడంతో ధరలు మరింతగా తగ్గాయని అసోసియేషన్‌ తెలిపింది.  

దేశీయంగా సాగు చేస్తున్న నూనె గింజనలతో  వంట నూనె ధరలు మరింతగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

వచ్చే నెలలో రేట్లు మరింత తగ్గనున్నాయి.  నూనె గింజల పంట చేతికి వచ్చి  కొత్త క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభం కానుండటంతో  ఈ ధరలు దిగి రానున్నట్లు తెలుస్తోంది. 

గ్లోబల్ మార్కెట్‌లో నూనె గింజల ధరలు  తగ్గుముఖం పట్టడంతోపాటు  దేశీయ మార్కెట్‌పైనా ప్రభావం చూపనుంది. 

గత 30 రోజుల్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు  8-10 శాతం మేర తగ్గడం సంతోషంగా  ఉందని సీఈఏ చైర్మన్ అన్నారు. 

రానున్న నెలలో ధర లీటరుకు  రూ.5-8 తగ్గే అవకాశం ఉందని  భావిస్తున్నారు.