జుట్టు నెరిసిపోవడం లేదా రాలిపోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయం

అయితే జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా బట్టతల వచ్చే అవకాశం ఉంది

కొన్ని అన్‌హెల్దీ ఫుడ్స్‌ తరచూ తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలుతుందిమరి అవేంటో తెలుసుకుందాం రండి

నివేదికల ప్రకారం, చక్కెరను అధికంగా తీసుకుంటే, అది బట్టతలకి కారణం కావచ్చు

చక్కెర వంటి అధిక గ్లైసెమిక్ ఆహారాలు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇలాంటి ఫుడ్స్‌కు దూరంగా ఉంటే మేలు

జుట్టు రాలడం సమస్య ఉన్నవారు చేపలని ఎక్కువగా తినకూడదు. ప్రస్తుతం దొరికే చేపల్లో పాదరసం ఎక్కువగా ఉంటోంది. 

ఇది శరీరానికి అనేక విధాలుగా హాని చేస్తుంది. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది

జంక్ ఫుడ్స్‌ వల్ల శరీరంలో బయోటిన్ క్షీణిస్తుంది. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఇవన్నీ జట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి