శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి

బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది అల్పాహారం ఆలస్యంగా తీసుకోవడం, టిఫిన్ చేయకపోవడం చేస్తుంటారు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తేనె, దాల్చిన చెక్కక, నీరు త్రాగితే ఆరోగ్యంగా ఉంటారు. దీని ద్వారా బరువు కూడా తగ్గించుకోవచ్చు

బొప్పాయి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ, కొద్దిగా తేనె కలపి తాగాలి. దీని ద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది

రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి

ఎండుద్రాక్షను నానబెట్టిన తరువాత ఉన్న నీటిని తాగడం ద్వారా రక్త హీనత ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది