జీవక్రియ అనేది వ్యక్తి శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ

శరీరం ఎంత ఎక్కువ కేలరీలను బర్న్ చేసి, దానిని శక్తిగా మారుస్తుందో అంత తక్కువ బరువు తగ్గుతారు

జీవక్రియకు సంబంధించి ఆహారాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి

మెటబాలిజానికి ఏవి మంచివి కావో ఇప్పుడు తెలుసుకుందాం

గ్లూటెన్, స్టార్చ్, ఫైటిక్ యాసిడ్ జీవక్రియను దెబ్బతీస్తుంది. ఇందులో వైట్ బ్రెడ్, మైదా, రైస్ వంటివి ఉంటాయి

అధిక చక్కెర కలిగిన పదార్థాలు ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తుంది. ఇందులో శీతల పానీయాలు, మిఠాయిలు, కేకులు మొదలైనవి చెప్పుకోవచ్చు

అధికంగా శుద్ధి చేసిన నూనెలు ఎక్కువగా వినియోగించడం వలన ఊబకాయం, టైప్ 2 మధుమేహం, వాపు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది

ప్రాసెస్ చేసిన ఆహారం జీవక్రియకు హానికరమని అనేక పరిశోధనలు వెల్లడించాయి.ఇందులో చిప్స్, క్యూర్డ్ మాంసాలు, సాల్టెడ్ గింజలు ప్రధానంగా చెప్పుకోవచ్చు