చాలా మంది పచ్చి కూరగాయలపై ‘ఉప్పు’ వేసుకుని తింటుంటారు. అలాగే సలాడ్ పైనా సాల్ట్ వేసుకుని తింటుంటారు
ఈ అలవాటు వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు
అధిక ఉప్పు తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు
ఐదు గ్రాములకు మించి ఉప్పు తింటే అధిక రక్తపోటుతో పాటు స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది
నిజానికి, ఉప్పులో సోడియం ఉంటుంది. ఈ సోడియం శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది
ఈ కారణంగా, చాలా మంది తక్కువ సోడియం ఉప్పును ఎంచుకుంటారు
సోడియం తక్కువగా ఉండే ఉప్పులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రపిండాల సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో సోడియం, పొటాషియం మినరల్స్ సరైన మోతాదులో ఉండటం ముఖ్యం
ఇక్కడ ఏకైక మార్గం ఆహారంలో తక్కువ మొత్తంలో ఉప్పును ఉపయోగించడమేనని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు