మిగతా కాలాల కంటే.. ఎండాకాలంలో గుడ్లను తక్కువగా తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినవచ్చు అంటున్నారు. అంతకంటే ఎక్కువ తింటే.. కొన్ని రకాల అనారోగ్యాలు తప్పవు అంటున్నారు.
గుడ్లు ఎక్కువగా తింటే.. ముఖ్యంగా వాటిని వండుకొని గానీ, ఫ్రై చేసి గానీ తింటే.. శరీరంలోకి సోడియం కంటెంట్ ఎక్కువగా వెళ్తుంది.
దాని వల్ల బాడీలో నీటి శాతం తగ్గిపోయి.. డీహైడ్రేషన్ సమస్య వస్తుంది అని చెబుతున్నారు.
గుడ్లలో ప్రోటీన్ ఎక్కువ. ప్రోటీన్ మనకు వేడి చేస్తుంది. గుడ్లు జీర్ణం అయ్యే సమయంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి.
ఎండాకాలంలో గుడ్లు ఎక్కువగా తింటే.. బాడీలో హీట్ పెరిగి.. వేడి వాతావరణంలో చాలా ఇబ్బంది కలుగుతుంది.
గుడ్లు అంటేనే గ్యాస్. వాటిని ఎక్కువగా తింటే.. కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు రాగలవు.