పీజా, బర్గర్, చిప్స్ అంటూ అదేపనిగా జంక్ ఫుడ్ వెంట పడ్డామంటే ఒళ్ళు కొవ్వెక్కడం ఖాయం

శరీరంలో మోతాదుకు మించి ఫ్యాట్ పెరిగితే ఏర్పడే ముప్పు గురించి కూడా అందరికీ తెలుసు

జంక్ ఫుడ్ తినడమనే అలవాటు డిప్రెషన్ కి కూడా  దారితీస్తుంది 

మితిమీరిన బాడీ ఫ్యాట్ నాడీ వ్యవస్థలోకి చెమ్మను చేర్చుతుందట

ఈ నీటి ఛాయలు మెదడులోని ఒక కీలక భాగం మీద ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలుస్తోంది

ఈ పరిణామం మనలోని భావోద్వేగాల్ని నియంత్రించే హైపోథాలమస్ అనే భాగాన్ని భ్రష్టు పట్టించి డిప్రెసివ్ సింప్టమ్స్ కి దారితీస్తుంది

జంక్ ఫుడ్ అంటే పడిచచ్చేవాళ్ళు జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది

లేకపోతే లేనిపోని మానసిక జబ్బులొచ్చి చిక్కుల్లో పడతారు