కాలేయం శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కాలేయం పనిచేస్తుంది. కావున, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
యాపిల్ తీసుకోవడం వల్ల మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం కూడా ఫిట్‌గా ఉంటుంది.
కీర దోసకాయను రోజూ తీసుకోవడం వల్ల కాలేయం బాగా పనిచేస్తుంది.
పుచ్చకాయ కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
క్యారెట్‌లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని, లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
వెల్లుల్లి కాలేయాన్ని డిటాక్స్ చేయడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తింటే చాలా మంచిది.