చలికాలంలో మీ ఆహారంలో సీజనల్ పండ్లను తీసుకోవడం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
యాపిల్స్: యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఆరెంజ్: నారింజ పండ్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
కివీ ఫ్రూట్: చలికాలంలో సాధారణంగా లభించే పండు, కివీలో విటమిన్ సి, ఐరన్, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు వంటి వివిధ పోషకాలు ఉంటాయి. చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పియర్స్: చలికాలంలో పియర్స్ తినడం వల్ల సెల్ డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ నివారించవచ్చు. వీటిలో ఉండే పెక్టిన్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తుంది.
స్ట్రాబెర్రీలు: యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది
ద్రాక్ష: అత్యంత పోషక విలువలు కలిగిన పండ్లలో ద్రాక్ష ఒకటి. , ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థకు మంచిది.
ప్లం: ప్లం ఆకలిని ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియ, రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.