చలికాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ముఖ్యంగా జీర్ణ సమస్యలు పెరుగుతాయి. అజీర్తీ, మలబద్దకం లాంటి సమస్యలు పెరుగుతాయి. కావున మలబద్దకాన్ని దూరం చేసే ఆహారాన్ని తీసుకోవాలి.

మెంతులు: మెంతికూర లేదా మెంతి గింజలలో ఎక్కువగా ఫైబర్‌ ఉంటుంది. ఇవి పిండి పదార్థాలను గ్రహించడంలో సహాయపడటంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

మెంతులు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. జుట్టు రాలడం, రక్తహీనత లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో ఖర్జూరం సహాయపడుతుంది. దీనిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.

ఉసిరి కూడా జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది, ఇంకా జీర్ణక్రియను మెరుగు పర్చి బరువు తగ్గడంలో సహాయపడుతుంది

నారింజలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్‌తో నిండిన నారింజ శీతాకాలంలో చేర్చుకుంటే.. మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు.

కిస్ మిస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉంటాయి. నానబెట్టిన ఎండు ద్రాక్షను తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.