ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు పలు రకాల డైట్లతోపాటు.. ఎక్సర్‌సైజ్ లాంటివి చేస్తున్నారు

బరువు తగ్గేందుకు వ్యాయామంతోపాటు సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు

ఫైబర్‌తో పాటు, బరువు తగ్గడానికి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి

బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి

పాలకూర రసం, పాలకూర సూప్, పాలకూర సలాడ్ లేదా కూర తీసుకుంటే అది బరువు తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు

శెనగలు తిన్న తర్వాత కడుపు చాలాసేపు నిండుగా ఉంటుంది. ఆకలి వేయదు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది

పెరుగు జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీంతోపాటు ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది