చలికాలంలో లైఫ్‌స్టైల్‌ పరంగా చాలా మార్పులు చేసుకోవాలి. అలాగే అందం, ఆరోగ్యం పరంగా మరింత జాగ్రత్త వహించాలి.

ముఖ్యంగా ఈ సీజన్‌లో గుండె సంబంధిత సమసల్యున్న వారు అప్రమత్తంగా ఉండాలి.

చలికాలంలో ఆరోగ్యకరమైన, పోషకాహారం బాగా తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయాలి.

అధిక కొవ్వు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఆహారంపై ఓ కన్నేసి ఉంచాలి. ఎక్కువ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి.

వాతావరణంలోని మార్పులు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇది కూడా గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.

చలికాలంలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి చల్లని లేదా అతి వేడి నీళ్లలో స్నానం చేయవద్దు. రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఇది గుండెకు హాని కలిగించవచ్చు.

అలాగే తలస్నానం చేసేటప్పుడు ముందుగా నీళ్లు పోసుకోకూడదు. ముందుగా కాళ్లపై, తర్వాత శరీరంపై, చివరగా తలపై నీరు పోసుకోవాలి. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చు.