భూమిపై బతికే పక్షులన్నింటిలో డేగ అత్యధికంగా 70 ఏళ్లు బతుకుతుందని అంటుంటారు

దీనిలో నిజమెంతా? అనేది మాత్రం ఇప్పటికీ చాలా మందికి ప్రశ్నగానే మిగిలిపోయింది

అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు డేగకు సంబంధించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు

అడవిలో బతికే డేగలు 30 ఏళ్లు బతుకుతాయి. ప్రత్యేకంగా పెంచే డేగలు 50 ఏళ్ల వరకు బతుకుతాయి

వన్యప్రాణుల జీవశాస్త్రవేత్త టాడ్ కాట్జ్నర్ 25 సంవత్సరాలు డేగలను అధ్యయనం చేసి 'ది ఈగిల్ వాచర్స్' అనే పుస్తకాన్ని రాశారు

గద్ద ముక్కు పెరిగిపోతే అది రాళ్లకేసి కొట్టుకుని, ముక్కు విరగగొట్టుకుంటుందని, కొంతకాలానికి తిరిగి డేగ ముక్కు పెరిగుతుందని అనుకుంటారు

ముక్కు విరగడం వంటివి జరిగితే అవి బతికినంతకాలం అంగవైకల్యంతోనే ఉంటాయి తిరిగి పెరిగే అవకాశం ఉండదని పేర్కొన్నారు

అంటే ముక్కుతిరిగి పెరగదన్నమాట. ఇలా ముక్కు విరిగిన పక్షులు ఆహారాన్ని తినలేవు. ఫలితంగా కొన్ని రోజులకు మృతి చెందుతాయి