రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలా ఆ పాత్ర అయినా గుర్తొచ్చే నటుడు నందమూరి తారక రామారావు.
అలాంటి పాత్రలున్న చిత్రాల్లో ‘భీష్మ’(1962) ఒకటి.
సీనియర్ ఎన్టీఆర్ భీష్ముని పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బి.ఎ.సుబ్బారావు తెరకెక్కించారు.
ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విరగబడి మరీ చూశారట.
ఈ చిత్రంలో యన్.టి.రామారావు భీష్ముడి పాత్రలో కనిపించడం పెద్ద ఆకర్షణ.
యౌవనం నుంచి గడ్డాలు, మీసాలతో ఉన్న వృద్ధ పాత్ర వరకూ అయినా నటనతో ఆకట్టుకున్నారు.
హరిబాబు తయారు చేసిన విగ్గు, గడ్డం, మీసంలో ఎన్టీఆర్‌ను చూస్తే నిజంగా భీష్ముడే అనిపిస్తారు.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రముఖ దర్శక, నిర్మాత చక్రపాణి ఎన్టీఆర్‌ని కలిశారు.
కాగా ‘నా గెటప్ చూసి ఎవరూ నన్ను గుర్తుపట్టడం లేదు’’ అని రామారావు చక్రపాణితో అన్నారట.
చక్రపాణి నవ్వుతూ ‘గుర్తు పట్టకపోతే ఎలా? నువ్వు అని తెలియకపోతే ఎందుకు వేసినట్టు ఆ వేషం? దండగ కదా!’ అన్నారుట.