అప్పుడే ‘ఆదిపురుష్‌’పై ప్రభాస్‌కి అనుమానం.. నచ్చచెప్పిన ఓం..

గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్‌’పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు కలెక్షన్స్ విషయంలో రాణిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

అప్పట్లో ‘రాధేశ్యామ్‌’ ప్రొమోషన్స్ లో ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ గురించి మాట్లాడిన వీడియో అది.

‘ఆదిపురుష్‌’ షూటింగ్ నాలుగు రోజులు చేసిన తర్వాత ‘నేను ఈ సినిమా చేయొచ్చా?’

నేను ఎప్పుడూ ఇలాంటి సినిమా/పాత్ర చేయలేదని ఓం రౌత్ ని అడిగానని తెలిపారు ప్రభాస్.

‘ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. నేనున్నా’ అని ఓంరౌత్‌ బదులిచ్చారని అన్నారు ప్రభాస్.

దీంతో ఓంరౌత్‌పై ఫైర్ అవుతున్నారు ప్రభాస్ ఫాన్స్.

రామాయణంలాంటి గొప్ప కావ్యాన్ని తెరకెక్కించినప్పుడు ఆలోచించకుండా ఇష్టానుసారం తీయడం సరికాదని విమర్శిస్తున్నారు.