మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan )ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

మహానటి , రీసెంట్ గా సీతారామం సినిమాతో సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించాడు దుల్కర్.

దుల్కర్ కు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. దాంతో దుల్కర్ నెక్స్ట్ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

తాజాగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ బాలీవుడ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల బాలీవుడ్ లో ఎక్కువగా బాయ్ కాట్ అనే పదం వినిపిస్తున్న విషయం తెలిసిందే.

బాయ్ కాట్ కల్చర్ కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉందని సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి కల్చర్ ఎక్కడా కనిపించలేదని అన్నారు దుల్కర్ సల్మాన్.

బాయ్ కాట్ దెబ్బకు చాలా సినిమాల పై అక్కడ నెగిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా బాలీవుడ్ లో విడుదలైన అన్ని సినిమాలకు బాయ్ కాట్ సెగ తగిలింది.

ఇక దుల్కర్ నటించిన చుప్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.