ఈ జనరేషన్‌ హీరోలు జస్ట్ హీరోలుగా ఉండిపోవాలి అనుకోవటం లేదు. అందుకే యాక్టింగ్‌తో పాటు ఇతర రంగాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తాజాగా ఛార్మింగ్ స్టార్‌ దుల్కర్ కూడా ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అన్న సిగ్నల్ ఇచ్చారు.

మల్టీ లింగ్యువల్‌ స్టార్‌గా దూసుకుపోతున్న మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. మాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్‌

తరువాత తెలుగు, హిందీ భాషల్లోనూ హీరోగా మంచి విజయాలు సాధించారు. రీసెంట్‌గా సీతారామమ్ సినిమాతో పాన్‌ ఇండియా హిట్ కొట్టారు.

ప్రజెంట్ హీరోగా బిజీగా ఉన్న దుల్కర్‌… నిర్మాతగానూ తన మార్క్‌ చూపిస్తున్నారు.

చుప్ దర్శకుడిగా కనిపించిన ఈ యంగ్ హీరో.. ఫ్యూచర్‌లో రియల్‌గానూ మెగాఫోన్ పట్టుకునే ఛాన్స్ ఉందని చెప్పారు.

ప్రస్థుతానికి నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నానన్న దుల్కర్ సల్మాన్‌… యాక్టింగ్‌ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్షన్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.