ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నందున వాహన తయారీ కంపెనీలన్నీ ధరల పెంపు బాట పట్టాయి
తాజాగా ఇటలీకి చెందిన సూపర్‌బైక్‌ల సంస్థ డుకాటీ (DUCATI) తన బైక్ ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది
జనవరి 1 నుంచి ఈ ధరల పెంపు ఉంటుందని తెలిపింది
అయితే ధరలు ఎంత మేరకు పెంచనుంది వెల్లడించలేదు
ముడిసరకుల ధరలు పెరిగిన కారణంగా ధరలను పెంచనున్నట్లు తెలిపింది
దిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై, కోచి, హైదరాబాద్, కోల్‌కతాలో ఉన్న డీలర్‌షిప్‌ల వద్ద అన్ని మోడళ్లపైనా ధరల పెంపు ఉంటుందని తెలిపింది