చాలామంది ప్రజలకు తమ రోజును ఒక కప్పు ‘చాయ్’తో ప్రారంభించే అలవాటు ఉంది
కొంతమంది టీని చల్లగా తాగితే.. మరికొందరికి పొగలుకక్కే చాయ్ తాగడం అంటే భలే ఇష్టం
ఎక్కువ వేడితో టీ తాగితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ముప్పు రెండింతలు పెరిగే అవకాశం ఉందని పరిశోధకలు తాజాగా ఓ అధ్యయనం తేల్చారు
60 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ వేడితో ఇష్టపడి టీ తాగేవారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందని పరిశోధకులు కనుగొన్నారు
టీని చల్లటి ఉష్ణోగ్రత వద్ద తాగేవారు ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని ఆ పరిశోధన పేర్కొంది
అందుకే టీ ఎప్పుడు ఎక్కువ వేడిగా తాగకండి