నిత్యం కొబ్బరి నీళ్లను తాగడం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. కొబ్బరినీళ్లలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి.

ప్రతిరోజూ చియా గింజలు, డ్రై ఫ్రూట్స్‌ను కొబ్బరి నీళ్లలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మీకు కొబ్బరి నీళ్ళను నేరుగా తాగడం ఇష్టం లేకపోతే వాటికి బదులుగా కొబ్బరి పాలను కూడా తీసుకోవచ్చు.

ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలోని మెగ్నీషియం, విటమిన్ సి, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాల లోపం తొలగిపోతుంది.

కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఈ డ్రింక్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

నిమ్మకాయలలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం చైనా ప్రజలు నిమ్మకాయల కోసం ఎగబడుతున్నారు.

కాబట్టి మీరు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొబ్బరి నీళ్లను నిమ్మరసంతో కలిపి తీసుకోండి.

రిబోఫ్లావిన్, నియాసిన్, థయామిన్, పిరిడాక్సిన్, విటమిన్లు,ఫోలేట్స్ వంటి పోషకాలు కొబ్బరి నీళ్లలో పుష్కలంగా ఉంటాయి.

ఇవి మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.