హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో డేటింగ్‌లో ఉన్నారని కొన్నాళ్లగా వార్త వస్తున్న సంగతి తెలిసిందే
దీనిపై ఆదివారం ఒక పత్రికా ఇంటర్వ్యూలో తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు తమన్నా
‘మేమిద్దరం కలిసి ఒక సినిమా చేశాం. అంతమాత్రానికే మామధ్య ఏదో ఉందని పుకార్లు చెలరేగాయి
ఇలాంటి అనవసర విషయాల గురించి నేనేం పట్టించుకోను. దానిపై స్పష్టతనివ్వాల్సిన అవసరమూ లేదు’ అని తెలిపారు తమన్నా
హీరోయిన్స్ విషయంలోనే ఇలాంటి ఊహాగానాలు రావడం దురదృష్టకరమని అంటూ ఈ విధంగా తెలిపారు
‘హీరోయిన్ల విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. మాకు నిజమైన పెళ్లి కావడానికి ముందే ఎన్నోసార్లు పెళ్లి చేసేస్తుంటారు.
వైద్యుల నుంచి వ్యాపారవేత్తలదాకా.. అందరితోనూ మాకు వివాహం జరిపిస్తుంటారు
అవన్నీ చదువుతుంటే ఒక్కోసారి నాకు కూడా నా పెళ్లైపోయిందేమో అనే అనుమానం కలుగుతుంది
ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకున్నా అదీ పుకారే అని జనం నమ్మరేమో’ అంటూ వాపోయారు తమన్నా