సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్‌కు అనుగుణంగా వచ్చే పండ్లను తినాలని సూచిస్తారు
రోజూ కనీసం 1, 2 పండ్లు తింటే శరీరం ఆరోగ్యవంతంగా, బలిష్టంగా తయారవుతుంది
కొంతమంది పండ్లు తినేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దాని వల్ల పండ్లలోని పూర్తి పోషకాలు శరీరానికి అందవు
పండ్లు తినడంలో ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం
కొందరు తినడానికి చాలా కాలం ముందు పండును కట్ చేస్తారు. దీని ద్వారా మీరు పండ్లు తినడం వల్ల పూర్తి ప్రయోజనం పొందలేరు. తినాలనుకున్న సమయంలో పండ్లను కోసి తినండి
ఫ్రూట్ సలాడ్ తింటున్నప్పుడు పండ్లపై ఎక్కువ ఉప్పు వేయకండి. దీని కారణంగా పండ్ల యొక్క సహజ లక్షణాలు దెబ్బతింటాయి. ఇంకా ఎక్కువ సోడియం మీ శరీరానికి చేటు చేస్తుంది
మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ వంటి కొన్ని పండ్లు ఉన్నాయి. వీటిని తొక్క తీసి తర్వాత తినాలి. అంతే కాకుండా యాపిల్, జామ వంటి పండ్లను తొక్కతో పాటు తినాలి
కొంతమంది ఫ్రూట్ సలాడ్‌ని కాఫీతో కలిపి తింటారు. అలా చేస్తే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్లను అస్సలు తినొద్దు