నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల మీ ముఖ కాంతి తగ్గిపోతుంది.

ఎక్కువ చక్కెర తినడం వల్ల మొటిమలు, ఫ్రీ-రాడికల్స్ సమస్యలు వస్తాయి. దీని కారణంగా ముఖంలో గ్లో తగ్గిపోతుంది.

మేకప్ ఎక్కువగా వేసుకోవడం వల్ల చర్మం పాడైపోయి డల్‌గా మారి, మెరుపును తగ్గిస్తుంది.

తరచుగా స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంలోని సహజమైన ఆయిల్ తగ్గిపోయి ముఖంలోని మెరుపు తగ్గుతుంది.

ఫేస్ వాష్‌ను ఎక్కువసేపు చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. ముఖం మెరుపు తగ్గిపోతుంది.