కొంతమంది వంకాయలను తినడానికి ఇష్టపడతారు. మరికొందరు వాటిని చూస్తేనే బెంబేలెత్తిపోతారు.
ఎంతో రుచికరమైన ఈ వంకాయలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
అదే సమయంలో కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారికి వంకాయను తినడం వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు.
కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు వంకాయ తినడం వల్ల అందులోని గింజలు కిడ్నీలో మరిన్ని రాళ్లు తయారయ్యేందుకు కారణం అవుతాయి.
వంకాయలో ఆక్సలేట్ అనే మూలకం కారణంగా ఎముకల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిగణించబడుతుంది.
రక్తహీనత, పైల్స్ సమస్యతో బాధపడేవారు వంకాయ తినడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు వంకాయ తింటే కీళ్లనొప్పుల సమస్య మరింత తీవ్రమవుతుంది.
వంకాయలు ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, దురద వంటి సమస్యలు వస్తాయి.