సూర్య గ్రహం మీ జాతకంలో అశుభ ఫలితాలను చూపిస్తుంటే  బెల్లం, గోధుమలు, ఎరుపు వస్త్రం, రాగి మొదలైన వాటిని దానం చేయాలి

చంద్రగ్రహం అశుభాలు తొలగి ఐశ్వర్యం పొందడానికి తెల్లని వస్త్రాలు, పాలు, పెరుగు మొదలైన వాటిని సాయంత్రం పూట పేదవారికి దానం చేయాలి

అంగారకుడి అశుభం తొలగిపోయి శుభం కలగాలంటే సూర్యోదయం నుంచి రెండు గంటల తర్వాత పప్పు, కుంకుమ, ఎర్రచందనం మొదలైన వాటిని ఎర్రటి వస్త్రంలో పెట్టి దానం చేయాలి

బుధ గ్రహం దోశాల నుంచి విముక్తి కావాలంటే బుధవారం నాడు సూర్యోదయం తర్వాత ఒక ఆకుపచ్చ వస్త్రంలో ఆకుపచ్చ పండ్లను దానం చేయాలి

బృహస్పతి అనుగ్రహం పొందడానికి పసుపు రంగు పండ్లు సాయంత్రం పసుపు వస్త్రంలో ఉంచి కొంత దక్షిణతో పేద బ్రాహ్మణుడికి దానం చేయాలి

శుక్ర గ్రహం అనుగ్రహం పొందాలంటే సూర్యోదయ సమయంలో జొన్న, దూది, పెరుగు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని దానం చేయాలి

శని గ్రహాం అనుగ్రహం పొందాలంటే మధ్యాహ్న వేళ నల్ల గుడ్డలో తేయాకు, ఉసిరి పప్పు, నల్ల నువ్వులు, ఆవాల నూనె, ఇనుము మొదలైన వాటిని దానం చేయాలి

రాహు గ్రహం అనుగ్రహం పొందాలంటే ఒక పేద వ్యక్తికి రాత్రిపూట ఆవాలు, బార్లీ, నలుపు రంగు వస్త్రం, దుప్పటి మొదలైన వాటిని దానం చేయాలి

కేతు గ్రహం అనుగ్రహం పొందాలంటే దుప్పటి, నల్ల నువ్వులు మొదలైన వాటిని పేదవాడికి దానం చేయాలి