ప్లాస్టిక్ వినియోగిస్తే క్యాన్సర్ వస్తుందని అందరూ చెబుతుంటారు
నిజానికి.. ప్లాస్టిక్ పాత్రల్లోని కొన్ని రసాయనాలు మనం తీసుకునే ఆహారం, పానీయాల్లో కొంతమేర కరుగుతుంది
ప్లాస్టిక్, క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధంలో ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయన సమ్మేళనాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి
సాధారణంగా ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి పదార్ధాలు వేస్తే హానికరమైన రసాయనాలు వేగంగా కరిగి ఆ పాత్రలోకి చేరుతుంది
ఆ ఆహారం మనం తింటే జీర్ణకోశంలోకి ప్రవేశించే అవకాశం ఉంది
ఫుడ్ గ్రేడ్ కాని ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి పదార్థాలను పెట్టకపోవడం, అవెన్‌లో పెట్టి వేడి చేయకపోవడం, అలాంటి వస్తువులను వాడకపోవడం మంచిది
క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను విడుదల చేసే పరిశ్రమలకు దూరంగా ఉండాలి