రమ్ బాటిల్‌పై xxx అంటే ఏమిటో తెలుసా?

మద్యం ప్రేమికులలో రమ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

వింటర్ సీజన్‌లో తాగేవారు రమ్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ఈ రమ్ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి తెలుపు రమ్, మరొకటి డార్క్ రమ్.

వైట్ రమ్‌ను కాక్ టెయిల్‌ల తయారీలో ఉపయోగిస్తారు.

సాంప్రదాయ రమ్‌ ప్రేమికకులలో డార్క్ వేరియంట్ మరింత ప్రజాదరణ పొందింది.

మీరు డార్క్ రమ్ బాటిళ్లపై xxx అని రాసి ఉండడం గమనించారా?

ఈ xxx అర్థం ఏమిటో తెలుసా? వైన్ నిపుణుల అభిప్రాయం మేరకు, సీసాపై రాసిన x, మందు తీవ్రతను చూపించడానికి ఓ సింబాలిక్ మార్గం.

xxx అంటే చాలా ఘాటైన ఆల్కహాల్. x, xx మందు తీవ్రతను తక్కువగా చూపిస్తుంది.

వైన్ నిపుణుల అభిప్రాయం మేరకు, పాత రోజుల్లో రమ్ బాటిల్‌పై రాసిన ఈ x మాత్రమే దాని తీవ్రతను తెలుసుకోవడానికి ఏకైక మార్గం.