తారకరత్న ఇండస్ట్రీకి ఎందుకు దూరమయ్యారో తెలుసా..

ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినవారిలో తారకరత్న ఒకరు. 

ఎన్టీఆర్ తనయుడు మోహన కృష్ణ కుమారుడే తారకరత్న. 

2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు.

ఆ తర్వాత ఒక సమయంలో 9 సినిమాలు అనౌన్స్ చేసి సంచలనం క్రియేట్ చేశారు. 

కానీ అంతగా ఆకట్టుకోలేదు. మొత్తం 15 సినిమాలు చేశారు. 

2012లో తారకరత్న.. అలేఖ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఆయన హీరోగ నటించిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య క్యాస్టూమ్ డిజైనర్. 

ఆయన సినిమా ఎంపికల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. 

దీంతో వరుస ప్లాపులతో సతమతమయ్యారు. 

ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.