సరైన టైం మేనేజ్‌మెంట్ లేనివారు ఎక్కువగా ఎగ్జామ్స్‌లలో కాపీ కొడుతుంటారు
పరీక్షకు కూర్చునే ముందువరకూ చదువుతూ ఉండేవారు టెన్షన్ పడిపోయి.. తీరా రాయాల్సిన సమయానికి గుర్తురాక పక్కచూపులు చూస్తారు
ఫెయిల్ అయిపోతామేమోననే భయంతో కూడా కాపీ కొడతారు
ఇళ్లల్లో పెద్దవాళ్లు పిల్లలను ఇతరులతో పోల్చితే ఎలాగైనా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తారు
నోట్సు సరిగ్గా రాయని వాళ్లు ఏం చదవాలో, ఎలా చదవాలో తేల్చుకోలేక కాపీ కొట్టడానికి సిద్ధమైపోతారు
చాలామంది కాపీ కొడుతున్నారు కదా నేనే రాస్తే తప్పేంటనే భావన కూడా
నిజానికి ఒక్కసారి పరీక్షలో కాపీ కొట్టి రాయడం ప్రారంభిస్తే, ఆ తర్వాత పరీక్షల్లో మనసు పెట్టి చదవాలని అనిపించదు