బ్రహ్మ కుమార్తె సంధ్యాదేవి తనకు ఉపదేశం చేసేందుకు బ్రహ్మచారి కోసం వెదుకుతున్న సమయంలో వశిష్ఠ మహాముని కనిపిస్తాడు

బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు ఆమెకు ఉపదేశం చేయడానికి అంగీకరించకపోవడంతో సంధ్యాదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది

ఆ అగ్ని నుంచి ప్రాతః సంధ్య, సాయం సంధ్యలతో పాటు ఒక స్త్రీ రూపం వెలువడ్డాయి. ఆ అందమైన స్త్రీ రూపమే అరుంధతి

అపురూప సౌందర్యరాశి అయిన అరుంధతిపై వశిష్ఠుడు మనసుపడతాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు

వీరిద్దరూ పెళ్లి చేసుకునే సమయంలో వశిష్ఢుడు తన కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తాను తిరిగివచ్చేంత వరకూ చూస్తూ ఉండమని చెప్పి వెళ్తాడు

అలా ఏళ్లు గడిచిపోయాయి. అయినా వశిష్ఠుడు రాకపోవడంతో అరుంధతి ఆ కమండలాన్నే చూస్తూ ఉండిపోయింది

ఎందరో పండితులు,ఋషులు ఆమెను చూపు మరల్చాలని చెప్పినప్పటికీ ఆమె మాత్రం కమండలం పై నుంచి చూపు తిప్పలేదు

ఇక చేసేది లేక విశిష్టుడిని వెతికి తీసుకొచ్చి ఆమెముందు నిలిపారు. ఆయన రాకతో తన చూపును కమండలం నుంచి విశిష్టుడి వైపు మరల్చింది

అప్పటి నుంచి అరుంధతి మహా పతీవ్రతగా నిలిచిపోయింది. అరుంధతి తన అకుంఠిత దీక్షతో నక్షత్ర రూపంలో వెలుగుతూ ఆకాశంలో చిరస్థాయిగా నిలిచిపోయింది

అందుకే మూడుముళ్లు వేసిన తర్వాత వరుడు వధువుకు అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. అరుంధతిలా సద్గుణాలు కలిగి ఉండాలని ఆ బంధం అరంధతి, వశిష్టులులా చిరస్థాయిగా వెలగాలని కోరుకుంటారు