ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిన నటులలో  సిల్క్ స్మిత ఒకరు. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం చాలా మంది ఎదురుచూసేవారు.

 కళ్ళతో ఆమె ఒక్క ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు.. కుర్రాళ్ళు బౌల్డ్ అవ్వాల్సిందే.

36 ఏళ్లకే ఆమె అకస్మాత్తుగా మరణించడం పట్ల అప్పట్లో పెద్ద సంచలనమే చోటుచసుకుంది. ఆమె చనిపోవడానికి అసలు కారణాలేంటో ఇప్పటికీ తెలియడం లేదు.

ఆమె మరణం పట్ల ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతుంటారు.

సిల్క్ స్మిత మరణించడం పట్ల సినీ పరిశ్రమంతా దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఆమె చివరి చూపు చూసేందుకు మాత్రం చాలా మంది రాకపోవడంతో అప్పటి జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు.

ముఖ్యంగా సిల్క్ స్మితను  చివరిసారిగా చూసేందుకు వచ్చిన అప్పటి టాప్ హీరో కేవలం యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రమే.

ఎవ్వరు కూడా పట్టించుకోకపోయినా అర్జున్  మాత్రం రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.