హిందూ వురాణాల ప్రకారం.. త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం.

అదే రాజస్థాన్‌ పుష్కర్‌ లోని బ్రహ్మ ఆలయం.

క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో దీన్ని నిర్మించారు.

బెరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది.

ముఖ్యంగా పుష్కర్‌లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఐతే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు.

బెరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్‌ చెయ్యకపోవడం విశేషం.

పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణేలు అమర్చారు.

ఈ టెంపుల్‌, దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నది భక్తుల మాట.