హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం. మనిషి ఎలా జీవించాలో రామాయణంద్వారా తెలుస్తుంది

మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్నదానికి రఘుకులోత్తముడైన శ్రీరాముడు ప్రతీక

అలాగే సాధ్వీమణి సీతమ్మ ఆడవారికి ఆదర్శం

మనిషి ఎలా నడుచుకుంటే.. దేవుడిలా పూజింపబడతాడో.. తరతరాలుగా ఎలా కీర్తింపబడతాడో తెలిపిన సజీవ సాక్ష్యం శ్రీరాముడు

ఈరోజు రామాయణం నుంచి ప్రతి స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో చూద్దాం

ప్రజలకు మేలు చేయడమే రాజు ధర్మం.. ప్రజలను హింసించే వారు స్త్రీ అయిన సరే జాలి చూపకుడదని తాటకి సంహారం మనకు తెలియచేస్తుంది

స్త్రీలు అనుచితమైన మాటలు చెప్పడము సహజం..  వారి సలహాలను అలోచించి ఆచరించాలి అని సీతా బంగారు లేడీ ని అడిగడం ద్వార మనకు తెలుస్తుంది

భర్త కష్టసుఖాల్లో సమానమైన భాగం పంచుకోవడమే పతివ్రత లక్షణమని సీతమ్మ రాముని తో అరణ్యానికి వెళ్ళడం ద్వారా తెలియజేస్తుంది

పతివ్రతల కన్నీరు భూమి పై పడిన చొ అరిష్టమని సీతమ్మ కన్నీరు పెట్టినంతనే రావణుడి లంకా దహనం తో రావణుడి పతనము మొదలైనది

పెళ్లైన స్త్రీ మూర్తి భర్తతో ఎలా ప్రవర్తించాలో సీత మహాస్వాధీని ఉదాహరణగా తీసుకోవాలని రామాయణం తెలుపుతుంది