చిన్న పిల్లలకు కట్టే తాయత్తులో ఏముంటుంది..?

ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలా మంది తమ పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే... 

ఆసుపత్రికి బదులు బాబాల దగ్గర తాయత్తులు కట్టించడానికి తీసుకెళుతుంటారు.

ఫలానా బాబా దగ్గర తాయత్తు కట్టించిన తర్వాతే ఆరోగ్యం బాగుపడిందని ఎవరో అంటే అది ఆనోటా ఈనోటా పాకి..

మొత్తం జనాలకు చేరుతుంది. అందుకే.. ఇప్పటికీ చాలా మంది తాయత్తులను నమ్ముతారు.

అసలు ఆ తాయత్తులో ఏం ఉంటుందనేది తెలుసుకోవడానికి టై చేద్దాం.

బాబాలు ఇచ్చే తాయత్తులో ఓ చిన్న పేపర్‌ ఉంటుంది. దానిపై దేవుడికి సంబంధించిన కొన్నివాక్యాలు రాసి ఉంటాయి.

'దేవుడు మనల్ని రక్తిస్తాడు.. మీ సమస్య నుంచి మిమ్మల్ని బయటవడేస్తాడు' అని చెబుతూ కొన్ని వదాలుంటాయి.

కొన్ని తాయత్తుల్లో ఉర్దూలో రాస్తే.. మరికొన్ని చోట్ల రాగి రేకుపై యంత్రాల బొమ్మలు గీసి ఉంటాయి.