ఆచార్య చాణక్య గొప్ప రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త
తన జీవితాంతం ఆచార్య తన అనుభవాల ద్వారా ప్రజలకు సరైన మార్గాన్ని చూపించారు
ఆచార్య మాటలు చదవడానికి, వినడానికి కఠినంగా అనిపిస్తాయి. కానీ అవి జీవిత వాస్తవికతను తెలుపుతాయి
చాణక్య నీతి ప్రకారం ఉత్తమ భార్యకు ఉండవలసిన లక్షణాల గురించి ప్రస్తావించాడు. అవేంటో తెలుసుకుందాం
మీరు చేసుకునే అమ్మాయి మనస్సు, లక్షణాలను చూడాలి కానీ బాహ్య సౌందర్యం కాదని చెప్పారు
కొంతకాలం తర్వాత అందం పోతుంది కానీ మంచి మనసు, లక్షణాలు ఉన్న స్త్రీ భర్త ఇంటిని స్వర్గంలా చేస్తుందన్నారు
మీరు చేసుకునే అమ్మాయికి ఎంత ఓపిక ఉంటుందో తెలుసుకోమని చెబుతున్నాడు
ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో భర్తకు అండగా నిలిస్తే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందన్నారు
స్త్రీ కోపంగా ఉంటే కుటుంబ జీవితం పూర్తిగా నాశనమవుతుంది. ఆ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది