వాస్తు సూత్రాలు ఇంటివరకే పరిమితం కాదు. వ్యాపార రంగాలలో పాటిస్తే అభివృద్ధి జరుగుతుంది
మీరు వ్యాపారవేత్త అయితే ఆఫీసులో, ఫ్యాక్టరీలో లేదా దుకాణంలో వాస్తు సూత్రాలను అమలు చేయాలి
వాస్తు నియమాలను అనుసరించడం ద్వారా లోపాలు దూరంగా ఉండటమే కాకుండా వ్యాపారంలో పురోగతి సాధిస్తారు
అలాంటి కొన్ని వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం
షాప్ లేదా షోరూమ్ మెయిన్ డోర్ కార్నర్‌కి బదులుగా మధ్యలో ఏర్పాటు చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి
వాస్తు ప్రకారం దుకాణంలో షెల్ఫ్ లేదా అల్మారా ఎల్లప్పుడూ వాయువ్య దిశలో ఉండాలి
ఇలా చేయడం వల్ల మీకు లాభంతోపాటు వ్యాపారంలో కలిసి వస్తుంది
పూజగది ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఉంచాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది
షాప్ లేదా ఆఫీసులో లేత రంగులు వేయాలి. దీని వల్ల వ్యాపార స్థలంలో సానుకూలత ఉంటుంది
వ్యాపారంలో పురోగతి కోసం కార్యాలయంలో పాంచజన్య శంఖాన్ని అమర్చవచ్చు