పిల్లులు చాలా తెలివైనవి. కానీ, వాటిని చాలామంది చెడుగా భావిస్తుంటారు
మూఢనమ్మకాల్లో భాగంగా పిల్లులను చూస్తే అశుభం జరుగుతుందని, ఏవేవో భావిస్తుంటారు
అదే వేరే విషయం అనుకోండి. అయితే, పిల్లుల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి
మనిషికి వెలి ముద్రలు ఎలా ఉంటాయో.. ప్రతి పిల్లికి ముక్కు ముద్రలు ఉంటాయి. పిల్లి ముక్కుపై ఉండే గీతల్లో కూడా వ్యత్యాసం ఉంటుందట
పిల్లి తన జీవితంలో మూడు వంతులు నిద్రపోవడానికే సమయం కేటాయిస్తుంది. 24 గంటల్లో సగం కంటే ఎక్కువ సమయం నిద్రపోతుంది
పిల్లి తన ఆహారాన్ని వాసన చూసి ఇష్టపడుతుంది. రుచి ఏమాత్రం పట్టించుకోదు
పిల్లిలో మరో ప్రతిభ ఉంది. పిల్లి తన గొంతు నుండి 100 కంటే ఎక్కువ రకాల శబ్దాలు చేయగలదు