పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆది పురుష్ సినిమా ద్వారా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను తిరుపతిలో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
వైట్ అండ్ వైట్ ధరించి చాలా హ్యాండ్ సమ్ గా కనిపించారు. చాలా అందంగా కనిపించడమే కాకుండా అందరిని ఆకట్టుకున్నారని చెప్పాలి.
ఇలా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో ప్రభాస్ ధరించిన డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ వేడుకకు ప్రభాస్ ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.
ఇక ఈ డ్రెస్ ఖరీదు ఎంత ఉంటుందని కూడా అభిమానులు చర్చలు మొదలుపెట్టారు.
ఇక ప్రభాస్ ధరించిన ఈ డ్రెస్ ఎంత ఉంటుంది ఏంటి అనే విషయానికి వస్తే… నిజానికి ప్రభాస్ కి ఈ డ్రెస్ ను కానుకగా ఇచ్చారని తెలుస్తుంది.
ఇక ఈ డ్రెస్ కోసం ఓం రౌత్ సుమారు పది లక్షల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది.
ఇలా డైరెక్టర్ ఎంతో అభిమానంతో తనకు ప్రత్యేకంగా డిజైన్ చేయించి డ్రెస్ కానుకగా ఇవ్వడంతో ప్రభాస్ అదే డ్రెస్సులో ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేశారు.