ప్రస్తుతం సెంగోల్ (రాజదండం) గురించి చర్చ జరుగుతోంది
రాజదండాన్ని కొత్త పార్లమెంట్ భవనంలో మోదీ రాజదండాన్ని ఆవిష్కరించనున్నారు
ఇంతకీ ఈ రాజదండం అంటే ఏంటి.? దీని చరిత్ర ఏంటంటే..
'సెంగోల్'ను అప్పటి మద్రాసులో ప్రఖ్యాత నగల వ్యాపారి వుమ్మిడి బంగారు చెట్టి రూపొందించారు.
రాజదండం ఐదు అడుగుల పొడవు ఉంటుంది. పైభాగంలో 'నంది' ఉంటుంది.
స్వాతంత్ర్యం అనంతరం దీన్ని అప్పటి ప్రధాని నెహ్రూకు బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ అప్పగించారు
'సెంగోల్' ఇప్పుడు అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది.
ఇప్పుడు దాన్ని కొత్త పార్లమెంటుకి తీసుకురానున్నారు
మరిచిపోయిన చరిత్రను గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగానే రాజదండంపై కేంద్రం దృష్టిసారించింది