బుల్లితెర కామెడీ షో పటాస్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకుంది.

నిలువ నీడలేని పరిస్థితి నుండి హైదరాబాదులో ఇల్లు, స్థలాలు కూడా కొనుక్కుని ఓ స్థాయికి ఎదిగిందని తెలుస్తోంది.

 చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ తన ముగ్గురు అక్క చెల్లెళ్లను పెద్ద చేసింది. 

పైమా కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కానీ అలాంటి పరిస్థితులను పైమా మార్చేసిందని చెప్పవచ్చు. 

ఎంతో కష్టపడి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. 

 బిగ్ బాస్ నుంచి కూడా భారీగానే పారితోషికం అందినట్టు తెలుస్తోంది. 

ఇలా ఫైమా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన సొంతింటి కల నెరవేర్చుకుంది. అంతేకాదు ఒక కారు కూడా కొనుక్కుంది. 

జబర్దస్త్ ద్వారా వచ్చే అమౌంటు, ఇతర ఈవెంట్లు, యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే అమౌంట్ ఇలా రకరకాల షోలు చేస్తూ చాలా డబ్బులు పోగేసుకుంది.

అలా ఇల్లు, కారు కొనుక్కొని ఉన్నదాంట్లో హ్యాపీగా ముందుకు వెళ్తోంది. అలా పైమా సంపాదించిన ఆస్తులు కోటికి పైగానే ఉంటాయని తెలుస్తోంది.