గూగుల్ లో నకిలీ ఫోటోలు ఎలా కనిపెట్టాలి మీకు తెలుసా ..

మనం ఇంటర్నెట్‌లో అనేక రకాలైన ఫోటోలను చూస్తూనే ఉన్నాము. అయితే ఇది నిజమా .. ? కాదా అనేది మాత్రం తెలియదు

ఎందుకంటే అచ్చం అలాంటి ఫోటోలని గ్రాఫిక్స్‌ తో మార్చివేసి వేరే విధంగా చూపిస్తారు

ఇలాంటివి ఎక్కువగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా జరుగుతుంది

మీరు ఎప్పుడైనా ఒక ఫోటో నిజమైనదా..? కాదా? అనేది తెలుసుకోవాలంటే చిన్న ట్రిక్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు

ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్‌ చేయడానికి ప్రధానంగా ఉపయోగించేది గూగుల్‌

గూగుల్‌లో మనకు కనిపించే ఫోటోలు నిజమా..? కదా అనేది గూగుల్‌ ఇమేజెస్‌ మనకు రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ను అందిస్తుంది

మనం ఏదైనా ఇమేజ్‌ వెతికినప్పుడు ఆ ఇమేజ్‌ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే గూగుల్‌ ఇమేజెస్‌కు వెళ్లి కెమెరా ఐకాన్‌ మీద క్లిక్‌ చేయాలి

మీరు చూసిన ఫోటో యూఆర్‌ఎల్‌ లేదా ఆ ఫోటోను నేరుగా అప్లోడ్‌ చేయాలి

అప్పుడు వెంటనే గూగుల్‌ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందో.. దాని మూలం ఎక్కడిదో మనకు తెలియజేస్తుంది