కళాతపస్వి కె విశ్వనాథ్ తన కెరీర్‌లో తీసిన ప్రతి సినిమా ఓ ఆణిముత్యమే
తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప వన్నె తెచ్చేలా 50కి పైగా సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు
కె విశ్వనాథ్ మొదట్నుంచీ కొన్ని సిద్ధాంతాలకు పరిమితమై ఉండేవారు
ఒక సినిమా పూర్తయ్యాక మరొక సినిమా చేసేవారు
'శంకరాభరణం' తర్వాతవచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుని ఉంటే హైదరాబాద్ సగం కొనేసేవాడినంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయనన్నారు
ఎంత పెద్ద సినిమా తీసినా వాళ్లు ఎంత ఇవ్వగలిగితే అంతే తీసుకునేవారట
అందుకే అప్పట్లో కె విశ్వనాధ్ తీసుకున్న పారితోషికంపై చాలా మందికి ఆసక్తి ఉండేది