ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హాలోవీన్ ఫెస్టివల్‌ను జరుపుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది
ఈ పండుగను క్రైస్తవులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు
ఈ రోజున తమ పూర్వికుల ఆత్మలు భూమిపైకి వస్తాయని విశ్వసిస్తారు
అందువల్ల ఈ రోజున భయంకరమైన దుస్తులను వారు ధరిస్తారు
ఇలా ధరించడం మూలంగా భూమిపైకి వచ్చిన ఆత్మలు వాళ్లను కూడా ఆత్మలుగానే భావించి తిరిగి వెళ్లిపోతాయట
అలాగే ఈ ఆత్మలు ఇళ్లలోకి ప్రవేశించకుండా ఇంటి గుమ్మాల ముందు గుమ్మడికాయలు రకరకాల ఆకారాల్లో కట్ చేసి పెట్టి, వాటిల్లో దీపాలు వెలిగిస్తారు
ఈ రోజు రాత్రి వీధుల్లో మంటలు వేసి, జంతువులను బలిస్తారు
ఒకప్పుడు యూరప్‌లోని క్రైస్తవులు జరుపుకునే ఈ పండగ తర్వాత కాలాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వాళ్లు జరుపుకుంటున్నారు