ఆకాశంలో మేఘాల్లోకి చేరిన నీటి బిందువులు ఎక్కువైతే మేఘం కరిగి భూమిపై వర్షం పడుతుంది
వర్షం కొన్ని సార్లు ప్రారంభంలో మంచు తునకలుగా ఉండి భూమిని చేరే క్రమంలో రాపిడికి గురై గడ్డలు కాస్తా కరిగి వర్షపు చినుకులుగా మారి నేలను తాకుతాయి
ఉరుములు, మెరుపులతో ఎత్తు కూడా ఎక్కువగా ఉండే మేఘం వడగళ్లు ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది
మేఘాన్ని రెండు భాగాలుగా విభజిస్తే, పై భాగంలో గడ్డ కట్టి, కింది భాగంలో సూపర్ కూల్డ్ వాటర్ ఉండాలి
వాతావరణానికి పై భాగంలో నీరు ప్రత్యేకమైన స్థితికి చేరడాన్ని సూపర్ కూల్డ్ వాటర్ అంటారు
ఈ స్థితిలో నీరు 0 డిగ్రీ సెల్సియస్‌లో ద్రవరూపంలో ఉంటుంది
మంచు గడ్డలు, దుమ్మురేణువు, వర్షపు బిందువులతో కలిసినప్పుడు వడగళ్లు ఏర్పడతాయి
అయితే ఈ మేఘానికి దగ్గరలో పైకి వీచే గాలులు ఉంటేనే వడగళ్లు వాన కురిస్తుంది