యంగ్ నటుడు విశ్వక్ సేన్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వరుస సినిమాల్లో నటిస్తూ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నారు.

విశ్వక్సేన్ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం దమ్ కి .. ఈ మూవీలో తన ఫస్ట్ పోస్టర్ను విశ్వక్సేల్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

మాస్ అండ్ క్లాస్ కలగలిపిన లుక్కులో ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఇటీవల సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుండడంతో పెద్ద హీరోలు భారీ మొత్తంలో రెమ్యున రేషన్ తీసుకుంటున్నారు.

 ఈ తరుణంలోనే సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న విశ్వక్సేను కూడా తన రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

ఇంకోవైపు తెలుగులో వరుసగా వస్తున్న చిన్న హీరోల సినిమాలు కూడా మంచి అంచనాలకు అనుగుణంగా దూసుకుపోతున్నాయి.

వీటి ఆధారంగానే పారితోషకం కూడా పెంచేస్తున్నారు యువ హీరోలు. ఇప్పటికే యువ హీరో నాగ శౌర్య రెమ్యూనరేషన్ నాలుగు కోట్లు దాటింది.

ఇక విశ్వక్సేన్ ప్రస్తుతం నాలుగున్నర కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.