పాముల విషయానికొస్తే.. పాములంటే ప్రజల్లో చాలా భయం ఉంటుంది

కానీ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో షెట్పాల్ అనే గ్రామంలో మనుషులు ఉన్నట్లు రకరకాల పాములు ఉంటాయి

ఈ గ్రామంలో నాగుపాములతో సహా అనేక రకాల పాములు ఉన్నాయి

షెట్పాల్ గ్రామం పూణే నుండి 200 కి.మీ దూరంలో ఉంది

ఇక్కడ ఇంటింటికీ పాములు కనిపిస్తుంటాయి. ఈ గ్రామంలో పాములను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు

ఈ గ్రామం కోబ్రా పాములకు నిలయం. ఇక్కడి గ్రామస్తులు పాములను పూజిస్తారు. ఎంతో గౌరవం ఇస్తారు

ఈ గ్రామంలోని పాములు జనాల మధ్యనే పెరగడం వల్ల పిల్లలు పాములంటే భయంలేకుండా పిల్లలు పాములను మెడలో వేసుకుని తిరుగుతారు

ఇప్పటివరకు ఈ గ్రామంలో పాములు కాటేసినట్లు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు