అచ్చం చూడటానికి.. స్టీల్ ముక్కలా కనిపించే ఈ వింత సబ్బు మార్కెట్లోకి కొత్తగా వచ్చింది

ఈ సబ్బును స్టెయిన్‌లెస్ స్టీల్ సబ్బు అని అంటారు. వెండి రంగులో సాధారణ సబ్బు ఆకారంలో ఉంటుంది

ఈ స్టీల్‌ సబ్బుకు వాసన కూడా ఉండదట

ఈ సబ్బు ప్రత్యేకత ఏమిటంటే చేతికి అంటుకున్నా దుర్వాసనను తొలగించడానికి భేషుగ్గా పనిచేస్తుంది

ఈ సబ్బుతో చేతులు కడిగారంటే వాసన మాయం అవుతుందనన్నమాట

ఈ సబ్బును ఉపయోగించడానికి ప్రత్యేక విధానం అంటూ ఏమీ లేదు

సాధారణ సబ్బులానే ఈ సబ్బును కూడా ఉపయోగించవ్చు. ఐతే ఈ సబ్బుకు నురుగు రాదు

చేతులను శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సబ్బును నీళ్లతో తడిపి చేతులతో రుద్దితే చేతి వాసన వదిలిపోతుంది

సాధారణంగా ఈ సబ్బు నాణ్యత బట్టి ధర రూ.250 నుంచి రూ.500 వరకు ఉంటుంది

ఆన్‌లైన్‌లో కూడా స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ సబ్బును ఆర్డర్ చేసుకోవచ్చు